calender_icon.png 6 June, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు

05-06-2025 12:47:05 AM

అమెరికా పర్యటనలో కేటీఆర్

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): అమెరికాలో బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వేల మైళ్ల ప్రయాణించి వచ్చిన కిశోర్ అనే అభిమానిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల కోసం కనెక్టికట్ నుంచి డల్లాస్ వరకు వచ్చినందుకు కిశోర్‌ను అభినందించారు.

కిశోర్ చూపిన అభిమానాన్ని కేటీఆర్ ఎక్స్‌లో పంచుకున్నారు. మీ ఆప్యాయత, మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డల్లాస్ నగరంలో భారతీయ విద్యార్థులతో సమావేశమయ్యారు. 

నా కల నిజమైంది: కిశోర్

నా కల చివరకు నిజమైందని అమెరికాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆయన అభిమాని కిశోర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం తమ పేరుతో కారు నెంబర్ తీసుకున్నానని, ప్రస్తుతం అదే కారులో మీ పక్కన కూర్చొని డ్రైవ్ చేయటం అదృష్టంగా భావిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే నాయకులు కేటీఆర్ అని కొనియాడారు.