19 August, 2026 | 3:12 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

ఆ నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలి

14-06-2026 01:11 AM

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

ఖైరతాబాద్, జూన్ 13(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు మహమ్మద్ గౌస్‌ను బహిరంగంగా ఉరితీయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను ఆయన శనివారం పరామర్శించారు.

మీడియాతో మాట్లాడుతూ మంత్రులు కేవలం పరామర్శలకే పరిమితం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించడానికి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. ఉరిశిక్ష పడే వరకు అతడిని జైలులోనే బంధించాలని ప్రభుత్వాన్ని కోరా రు. భవిష్యత్తులో మైనర్ బాలికలు, వృద్ధ మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.