వానలు కురిపించు ‘కప్పతల్లి’
- కప్పలకు పూజలు చేసి, ఆటలు
- గ్రామదేవతలకు నైవేద్యం సమర్పణ
- మహబూబాబాద్ జిల్లా చీన్యాతండాలో పాత సంప్రదాయం
మహబూబాబాద్, జూన్ 13 (విజయక్రాం తి): ఓ వైపు ఎండల తీవ్రత.. మరో వైపు వర్షా లు ఆలస్యమవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరుణుడిని ప్రస న్నం చేసుకునేందుకు మొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పూర్వీకుల నుంచి వస్తున్న ‘కప్పతల్లి ఆటలు’ మళ్లీ కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో శనివారం కప్పతల్లి ఆట ఆడారు. వర్షాల కోసం గ్రామస్థులు కప్పలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, చిన్నారులచే ఊరంతా ఊరేగించారు.
ఇంటింటికీ తిరుగుతూ ‘కప్పతల్లి నీళ్లాడే.. కడవలన్నీ నిండాలే.. పంట పొలాలు పచ్చగా మారాలే’ అంటూ పాటలు పాడారు. గ్రామస్థులు బి య్యం, ధాన్యం, నగదు రూపంలో విరాళాలు అందించారు. సేకరించిన సామగ్రితో సామూహిక వంటలు చేసి గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు. కప్పతల్లి ఆట మూఢనమ్మకం కాదని, గ్రామ ప్రజలను ఒకచోట చేర్చి ప్రకృతి పట్ల గౌరవ భావాన్ని పెంపొందించే సాంస్కృతిక సంప్రదాయమని పేర్కొన్నారు.






