16-12-2025 06:28:03 PM
హైదరాబాద్: ఆస్ట్రేలియా కాల్పుల ఘటన నిందితుడు సాజిద్ అక్రమ్ పై డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సాజిద్ హైదరాబాద్ వాడేనని, ఆయన బీకామ్ చదివి 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడని డీజీపీ పేర్కొన్నారు. యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను సాజిద్ ఆక్రమ్ పెళ్లి చేసుకున్నాడని, ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన నిందితుడు భారత్ కు ఆరుసార్లు వచ్చాడని తెలిపారు.
సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత్ పాస్ పోర్టునే వినియోగిస్తున్నాడని, తనకు నవీద్ అక్రమ్ అనే కుమారుడిలో పాటు కుమార్తె ఉందని డీజీపీ వెల్లడించింది. సాజిద్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎలాంటి నేర చరిత్ర లేదని, హైదరాబాద్ లో ఉన్న తన కుటుంబీకులను విచారించినప్పుడు ఉగ్రవాద సంబంధంపై తమకేమీ తెలియదన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు ఆదివారం సిడ్నీ బీచ్ లో పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో 15 మంది యూదులు మరణించారు.