29-10-2025 12:48:38 AM
నాగప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎస్‌ఆర్‌ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరాదేవీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపశ్రీ కొపురు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం నాగరాజశేఖర్‌రెడ్డి.. కథ, కథనం అందిస్తూ దర్శకత్వ బాధ్యతల్నీ నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన కంటెంట్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో ప్రేమగీతం ‘నాకోసం ఆ వెన్నెల’ను నటుడు జేడీ చక్రవర్తి చేతుల మీదుగా టీమ్ విడుదల చేయించింది.
‘నాకోసం ఆ వెన్నెల.. దిగివచ్చింది కన్యలా.. యదలో నిండిన సంపద.. మది గదిలో నాటిన పూపొద..’ అంటూ సాగుతోందీ పాట. ఎంఎం కుమార్ సమకూర్చిన బాణీకి శివ సాహిత్యం అందించగా మేఘన, మనోజ్ ఆలపించారు. అజయ్ ఘోష్, భోగిరెడ్డి శ్రీనివాస్, సారిపల్లి సతీశ్, యశోద ఆర్ కొలిశెట్టి, సునీల్ రావినూతల, డార్లింగ్ దాస్ ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కుమార్; కెమెరా: సురేశ్ బాలా; ఎడిటింగ్: ఉపేంద్ర.