28-10-2025 08:26:35 PM
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7పీఎం, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనారావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు టాలీవుడ్ దర్శకులు కరుణకుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నందకిషోర్ అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ.. “పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తన తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్స్‌కు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది” అన్నారు.
“తనకంటూ ఓ మార్క్‌ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అందరినీ ఆకట్టుకుంటుంది” అని దర్శకుడు సన్నీ తెలిపారు.
దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే, నాకు పెళ్లయి రెండేళ్లు అవుతోంది. కానీ ఇంకా ఆల్బమ్ రాలేదు (నవ్వుతూ). ట్రైలర్ బాగుంది. సినిమా మరింత బాగుంటుందని ఆశిస్తున్నాను. సిట్యువేషనల్ కామెడీతో రానున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది” అని పేర్కొన్నారు.
దర్శకుడు ఆదిత్యహాసన్ మాట్లాడుతూ.. ‘తిరువీర్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఈ మూవీతో దర్శక, నిర్మాతలకు బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా” అన్నారు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. “కొత్త వాళ్లను సపోర్ట్ చేసేందుకు మేం ఎప్పుడూ ముందుంటాం. మంచి కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది” అని చెప్పారు.
దర్శకుడు దుశ్యంత్ మాట్లాడుతూ.. “ఎవరైనా ఏదైనా కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తుంటే.. వారికి ఫస్ట్ ఛాయిస్‌గా తిరువీర్ నిలుస్తున్నారు. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.
దర్శకుడు ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ.. “తిరు ఎప్పుడూ మంచి కథల్ని ఎంచుకుంటూ ఉంటారు. స్టార్ హీరోలు వారి స్టార్‌డమ్‌ను బట్టి, లెక్కల్ని బట్టి కొన్ని కథలు చేయలేరు. ఎలాంటి పాత్రనైనా తిరువీర్ అవలీలగా పోషిస్తాడు” అని చెప్పారు.
దర్శకుడు రూపక్ మాట్లాడుతూ.. “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ స్వీట్, సింపుల్, సెన్సిబుల్, ఫన్ రైడ్. ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది” అన్నారు.
దర్శకుడు తేజ మాట్లాడుతూ.. “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంలో చాలా మంది కొత్త వాళ్లే కనిపిస్తున్నారు. కొత్త నిర్మాతలకు ఈ చిత్రంతో డబ్బులు బాగానే వస్తాయి. అందరూ తప్పకుండా సినిమా చూసి కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయండి” అన్నారు.
దర్శకుడు నందకిషోర్ మాట్లాడుతూ.. “తిరువీర్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన ప్రతీ సినిమాలో, ప్రతీ పాత్రలో సహజత్వం ఉట్టి పడుతుంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో ఆయనకు మరింత సక్సెస్ రావాలని కోరుకుంటున్నా” అన్నారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. “నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నా. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నా” అన్నారు.
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ.. “మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మేం ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మూవీని చేశాం. మంచి కంటెంట్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా మా చిత్రం ఉంటుంది” అని తెలిపింది.
చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది” అన్నారు. “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని చిత్ర నిర్మాత సందీప్ అగరం అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బాల నటుడు రోహన్, నటి యామిని, నటుడు నరేంద్ర, సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.