calender_icon.png 1 November, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

హ్యాపీ బర్త్ డే

29-10-2025 12:55:40 AM

రాఘవ లారెన్స్ 1979, అక్టోబ ర్ 29న పుట్టారు. బుధవారంతో ఆయన వయసు 46కు చేరనుంది. భారతీయ చిత్రపరిశ్రమలోని డ్యాన్స్ మాస్టర్లలో ప్రముఖుడు. నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగానూ ఫేమస్. 90ల్లో ప్రేక్షకా దరణ పొందిన ‘చికుబుకు చికుబుకు రైలే’ (అర్జున్ సర్జా చిరంజీవికి ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ (చిరంజీవి వంటి పాటలకు డ్యాన్స్‌ను ఈయనే కొరియోగ్రఫీ చేశారు. ముని, డాన్, కాంచన సినిమాల్లో నటుడిగా మెప్పించారు. 

కొణిదెల నాగేంద్రబాబు.. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు సుపరితు డు.  అంజనా ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. నటుడిగా ఎన్నో సినిమాలతో మెప్పించారు. మరెన్నో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 1961, అక్టోబర్ 29న జన్మించిన నాగబాబు బుధవారం 64వ పడిలోకి అడుగుపెడుతున్నారు.

శ్రీదేవి విజయ్‌కుమార్.. 1986, అక్టోబర్ 29న తమిళ నటులైన విజయ్‌కుమార్, మంజుల దంపతులకు జన్మించారు. బుధవారంతో ఆమె 39వ పడిలో అడుగుపెడుతున్నారు. 1992లో బాలనటిగా తమిళ చిత్రం ‘రిక్షా మామ’తో తెరంగేట్రం చేసింది. తెలుగులో ఈశ్వర్, నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్ వంటి సినిమాలు ఆమె గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా కాలం తర్వాత ఆమె ఇటీవల నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’లో హీరోయిన్‌గా కనిపించారు. 

టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన హీరోయి న్ రీమాసేన్ పుట్టిన రోజు బుధవారమే. 1992, అక్టోబర్ 29న జన్మించిన రీమా బుధవారంతో 33వ పడి లోకి అడుగిడుతోంది. తెలుగులో ఉదయ్‌కిరణ్ ‘చిత్రం’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత  ‘మనసంతా నువ్వే’ కూడా హిట్ అయింది. తమిళ, హిందీ, బెంగాలీ, కన్నడ సినిమాల్లోనూ నటించింది.