10 June, 2026 | 3:56 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఆయా షేర్ వందలాది డ్యాన్సర్లతో..

10-02-2026 12:00 AM

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో మోహన్‌బాబు, సంపూర్ణేష్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ సెట్‌లో వందలాది మంది డ్యాన్సర్లతో ‘ఆయా షేర్..’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు.

హీరో నాని ఇంట్రో సాంగ్ ఇది. దీన్ని అనిరుధ్ రవిచందర్ స్వరపర్చగా, దళపతి విజయ్ ‘జననాయగన్’కు పనిచేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ ఈ పాటను నాని ట్రేడ్‌మార్క్ మాడ్‌నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో రూపొందిస్తున్నారు. ఎనిమిది భాషల్లో పాన్-వరల్డ్‌గా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్; డీవోపీ: సీహెచ్ సాయి; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా; నిర్మాత: సుధాకర్ చెరుకూరి; రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.