11-02-2026 01:29:22 AM
అంకిత జాదవ్, రోహిత్ భోగ హీరోహీరోయిన్లుగా నటించగా ‘నువ్వే ఉండిపో ఇలా..’, ‘నువ్వేలే..’ పేరుతో రెండు పాటలు రూపొందాయి. అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో కొరియగ్రాఫర్ సత్య మాస్టర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ పాటలకు కేకే రెడ్డి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. జయంత్ ఆర్యన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటలకు రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. సింగర్స్ లిప్సిక, అదితి భావరాజు పాడారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సాయి రాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆషురెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.