15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అక్రెడిటేషన్ జీవోపై అసెంబ్లీలో చర్చించాలి

02-01-2026 12:44 AM

ఎమ్మెల్యేలకు జర్నలిస్టుల యూనియన్ వినతి

మేడ్చల్, జనవరి 1 (విజయక్రాంతి): జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో నెంబర్ 252 పై అసెంబ్లీలో చర్చించాలని మేడ్చల్ జిల్లా టియుడబ్ల్యూజే, టీజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలి స్టులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానందును కలిసి విన్నవించారు. బోయిన్పల్లి లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కొంపల్లిలో కుతుబులాపూర్ ఎమ్మెల్యే వివేక్ నివాసాల్లో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ జీవో జర్నలిస్టులను విభజించేలా ఉందని, అంతేగాక పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు నష్టపోతారని వారు తెలిపారు. టియుడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకట్, స్టాఫ్ రిపోర్టర్లు రామారావు, రవి కిరణ్, భరత్ కళ్యాణ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుగ్రీవుడు, సభ్యులు ఎర్రోళ్ల బాబు, ఎర్రోళ్ల కృష్ణ, సైదు లు పాల్గొన్నారు.