02-01-2026 12:47:42 AM
ఘట్‌కేసర్, జనవరి 1 (విజయకాంతి): నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని గురువారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్‌లను కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘనపురం మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ బోర్డు మెంబర్, మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రరెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.