24-02-2026 12:06:46 AM
అలంపూర్, ఫిబ్రవరి 23:నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలోని ఓ ఆలయంలో రజకులపై జరిగిన దాడి ,చిన్నారి హత్యకు కారకులైనా నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు.మేరకు సోమవారం అలంపూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చిన్నారి యొక్క ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.ఆలయంలోకి వెళ్లారన్న సాకుతో రజక కులస్తులపై సర్పంచ్ తుకారాం రెడ్డి అతని వర్గం చేసిన ఈ దాడి అమానుషమని నాగరికత లోకానికి మచ్చన్నారు.ఒక బాధ్యతగల సర్పంచి పదవిలో ఉండి రక్షణ ఇవ్వాల్సింది పోయి..
ఇలా రాక్షసుడులా మారి పసిబిడ్డను కాలితో తన్నడం వంటి చర్యలు చూస్తే అగ్రకుల అహంకారానికి ప్రతీకగా స్పష్టమవుతుందన్నారు.ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దళిత బహుజనుల ప్రాణాలకు రక్షణ లేక పోతే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందని మండిపడ్డారు.నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్పీ టీం నాయకులు బోరెల్లి మహేష్, జనసేన నాయకులు ఉద్యమకారులు రవికుమార్, సురేష్ ,ఏలియా, చెంచు చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు