15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

24-02-2026 12:06 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): త్వరలో జరిగే ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25  నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్, మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించబడతాయని, ఇట్టి వార్షిక పరీక్షలకు సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లు  చేయాలని  విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్, వైద్య, సమాచార, పంచాయతి రాజ్, రవాణా, విద్యుత్తు, ఆర్టీసీ, ట్రెజరి, పోస్టల్,  మున్సిపల్ అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, రవాణా సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య ప్రశ్న, జవాబు పత్రాలు డోర్ క్లోజ్డ్ వాహనాలలో మాత్రమే తరలించాలని సూచించారు. జిల్లాలో 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణకు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యవేక్షణకు ఫ్లైయింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అనువుగా అదనపు బస్సులు నడపాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, డిఈఓ అశోక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, డిపిఓ యాదగిరి, పోలీస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.