calender_icon.png 9 January, 2026 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెలెన్ కిల్లర్ విద్యాసంస్థ ఘనత

07-01-2026 12:00:00 AM

బీఎస్సీ క్లినికల్స్ సైకాలజీ హానర్స్ కోర్సు ప్రారంభం

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): హెలెన్ కిల్లర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ ఆర్కే పురం నేరేడ్‌మెట్ హెలెన్ కిల్లర్ విద్యా సంస్థ నందు బీఎస్సీ క్లినికల్ సైకాలజీ హానర్స్ కోర్స్ 2025-26 విద్యాసంవత్సరంలో మైలురాయి చేరింది. మొదటిసారిగా ఆర్‌సిఐ రిహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి అనుమతి పొంది బీఎస్సీ క్లినిక ల్స్ సైకాలజీ హానర్స్ కోర్సును హెలెన్ కిల్లర్ విద్యాసంస్థలు ప్రారంభించారు.

ఈ కోర్స్ ద్వారా విద్యార్థులు క్లినికల్ సైకాలజీ రంగంలో ప్రామాణికమైన శిక్షణ పొందుతారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరిశోధన చికిత్స విధానాలు, సమాజానికి అవసరమైన సేవలను అందించడానికి ఈ కోర్సు ఒక బలమైన వేదిక నిలుస్తుంది. ఈ కోర్సు హెలెన్ కిల్లర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కు అనుమతి రావడం ఒక గొప్ప గుర్తింపు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.