29 April, 2026 | 2:13 AM

లుక్కు కుదిరింది!

29-04-2026 12:24 AM

అగ్ర నటుడు చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లితో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఖచీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు-బాబీ కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనా లు ఏర్పడ్డాయి.

‘చిరు-బాబీ2’ అనే వరి ్కంగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చి త్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ తాజా గా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుం టే.. చిరు ఇందులో పవర్‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్‌లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఇ ప్పటికే విడుదలైన హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ పోస్ట ర్ హ్యూజ్ బజ్ క్రి యేట్ చేసిందీ ప్రాజె క్టు. చిరంజీవి కొత్త షే డ్‌లో కనిపించనున్నట్లు ఆ పోస్టర్ హింట్ ఇచ్చింది.

మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌నున తనదైన స్టైల్లో అద్భుతంగా తీర్చిదిద్దే బాబీ.. ఈసారి మెగాస్టార్ కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. ఈ కాంబో నుంచి హై-ఆక్టేన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ రాబోతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.