calender_icon.png 11 December, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా బిడ్డలను రక్షించండి

09-12-2025 01:10:09 AM

  1. మాలి దేశంలో తెలుగువారి కిడ్నాప్
  2. 15 రోజులైనా ఆచూకీ లేదు
  3. కిడ్నాపర్ల చెర నుంచి విడిపించండి
  4. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బాధిత కుటుంబ సభ్యుల మొర
  5. విదేశాంగ శాఖతో మాట్లాడిన బండి సంజయ్

కరీంనగర్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): బతుకు దెరువు కోసం మాలి దేశం వెళ్లిన నల్లమాసు ప్రవీణ్‌రెడ్డి, కుమారాకుల రామచంద్రలను కిడ్నాపర్ల చెర నుండి విడిపిం చేలా చొరవ తీసుకోవాలని కోరుతూ బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కోరారు. ప్రవీణ్‌రెడ్డి తండ్రి జంగయ్యతోపాటు రామచంద్ర సహోద్యోగులు, స్నేహితులు పలువురు కరీంనగర్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ఏపీలోని కర్నూ లు జిల్లాకు చెందిన రామచంద్ర మాలి దేశం లో రూబీ కంపెనీలో ఏడాది కాలంగా ఉద్యో గం చేస్తున్నారు. వారిని గత నెల 23న మాలి దేశంలోని జెఎన్‌ఐఎం అనే తీవ్రవాద సంస్థ సభ్యులు కిడ్నాప్ చేశారని వాపోయారు. ఇప్పటి వరకు ఆచూకీ లేదని, ఆ దేశ ప్రభు త్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

మాలి దేశ ప్రభుత్వంతో మాట్లాడి కిడ్నాపర్ల చెర నుండి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ భార త విదేశాంగ శాఖ మంత్రిత్వ కార్యాలయ అధికారులతో మాట్లాడారు. మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కిడ్నాపర్ల చెర నుండి తెలంగాణ వాసులను రక్షించేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. కిడ్నాపర్ల చెర నుండి విడిపించేందుకు మాలి దేశంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు.