9 May, 2026 | 2:33 PM

Breaking News

బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •   తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే   •   పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం   •   ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •  

యువతలో స్ఫూర్తిని పెంచడమే లక్ష్యంగా

23-01-2025 12:00 AM

హైదరాబాద్: ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న  18వ రాజీవ్‌గాంధీ ఆలిండి యా అండర్-19 టీ20 టోర్నీలో బీహార్‌పై చెన్నై జట్టు విజయాన్ని సాధించింది. మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరైన క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వి.హనుమంత రావు కరణ్ కన్నన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందించారు.

వి హనుమంతరావు మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గత 18 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ పేరుతో  అండర్--19 టీ-20 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మమత, కాంగ్రెస్ నేతలు అప్సర్ యూసుఫ్ జాయి, అమర్ జీత్, సయ్యద్ పాషా తదితరులు పాల్గొన్నారు.