26 June, 2026 | 6:25 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

రెండో రౌండ్‌లో తనీశా జోడీ

23-01-2025 12:00 AM
  1. పీవీ సింధు ఓటమి
  2. ఇండోనేషియా మాస్టర్స్

జకర్తా: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు. సింగిల్స్‌లో లక్ష్యసేన్, మిక్స్‌డ్ డబుల్స్ మినహా మిగతా అన్నింటిలోనూ పరాజయాలే ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-9, 21-14తో ఒబయాషి (జపాన్)పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీశా- ధ్రవ్ జోడీ 21-18, 21-14తో పాంగ్ హో- సు యిన్ (మలేషియా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. మరో డబుల్స్ జోడీ రోహన్ కపూర్-రుత్విక జోడీ మాత్రం పరాజయం పాలైంది. భారత షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది.

మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సింధూ 20-22, 12-21తో వియత్నాంకు చెందిన తుయ్ గుయెన్ చేతిలో ఓటమి చవిచూసింది. మిగిలిన మ్యాచ్‌ల్లో తాన్య హేమంత్, అనుపమ ఉపాధ్యాయ ఓటమి పాలవ్వగా.. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి తొలి రౌండ్‌కే పరిమితమయ్యారు.