calender_icon.png 20 December, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీ మోటార్ ఇండియా నుంచి సరికొత్త హెక్టర్ లాంచ్

20-12-2025 12:01:51 AM

11.99 లక్షల నుంచి ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి): ప్రముఖ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మో టార్ ఇండియా ఇటీవల ఇన్నర్ 11.99 లక్షల నుంచి ప్రారంభమయ్యే సరికొత్త హెక్టర్‌ను ప్రారంభించింది. బోల్డ్ డిజైన్, సాటిలేని సౌకర్యం, మార్గదర్శక సాంకేతికత, డైనమిక్ డ్రైవింగ్ అనుభవంతో గణనీయమైన ముం దడుగును సూచిస్తూ జేఎస్‌డ బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త ఎంజీ హెక్టర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆల్ న్యూ హెక్టర్ కొత్త ఫ్రంట్, రియర్ బంపర్ డిజైన్, సరికొత్త గ్రిల్ డిజైన్, కొత్త అల్లాయ్ వీల్‌సతో అద్భుతమైన బాహ్య రూపాన్ని కలిగి ఉంది. అలాగే రెండు కొత్త రంగులను సెలాడాన్ బ్లూ, పెర్ల్ వైట్ అందిస్తున్నది. కొత్త ఎంజీ హెక్టర్ కొత్త ఆరా హెక్స్ గ్రిల్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో కొత్తగా రూపొందించిన ఆరాస్కల్ప్ బంపర్లు ఉన్నా యి. ఆల్ న్యూ ఎంజీ హెక్టర్ శ్రేణి 11.99 లక్ష ల ప్రారంభ ధరకు వస్తుంది.

దీనికితోడు ‘ఆన్-రోడ్ ధర’, ఉపకరణాలు రెండింటికి 100% నిధుల మద్దతు, ప్రత్యేకమైన కార్ యాజమాన్య కార్యక్రమం ఎంజీ షీల్డ్, ప్రా మాణిక 3+3+3 ప్యాకేజీ, ఇందులో అపరమిత కిలోమీటర్లతో మూడేళ్ల వారంటీ, మూ డేండ్ల రోడ్‌సైడ్, ౩ లేబర్ ఫ్రీ పీరియాడిక్ సేవల్ ఉన్నాయి. కొత్త హెక్టర్‌ను 100% ఆన్‌రోడ్ ప్రైస్ ఫండింగ్‌తో కొనవచ్చు.