18-12-2025 01:07:19 AM
కిలో రూ.2.20 లక్షలు దాటిన ధర
హైదరాబాద్, డిసెంబర్ 17: అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో పసిడి, వెండి ధరలు ఉన్నాయి. ముఖ్యంగా వెండి ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే వెండి కిలో రూ.11 వేలు పెరిగింది. అలాగే బంగారం కూడా రూ.650 పెరిగి రూ.1,34,510కి చేరుకుంది. ప్రపంచ వాణిజ్యంలో బంగారం కంటే వెండికి గిరాకీ ఎక్కువుగా కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. బుధవాం వెండి కిలో ఏకంగా రూ.11,000 పెరిగి రూ.2.22 లక్షల మార్కుకు చేరాయి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి ధరలు రూ.87,578 నుంచి రూ.1,18,533 లేదా 135.34 శాతం పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై అనిశ్చితి, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డాలర్ విలువలు హెచ్చతగ్గులు బంగారానికి డిమాండ్‌ను మరింత పెంచేసింది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,34,510 వద్ద పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి 1,23,300 పలుకుతోంది. వెండి ఏకంగా రూ.11 వేలు పెరిగింది. దీంతో ఓవరాల్‌గా సిల్వర్ రేటు రూ.2,22,000కు చేరుకుంది.