బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అరాచక రాజకీయం
సింగరేణి భవనాలు కాలబెట్టాలనడం ప్రమాదకరం
ఆ వ్యాఖ్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): సమాజంలో అస్థిరత సృష్టించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకుడు బహిరంగ వేదికపై ‘మిలిటెంట్ యాక్టివిటీ చేయండి’, ‘సింగరేణి భవనాలు కాలబెట్టండి’, ‘రైల్వే పట్టాలు కోయండి’ అంటూ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి, బాధ్యతారాహిత్య మైనవి, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి అని అన్నారు.
రాజకీయాల్లో ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాల్సింది పోయి.. యువతను హింస, విధ్వంసం, చట్టవ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపించడం బీఆర్‌ఎస్ అసలు రాజకీయ స్వభావాన్ని బయటపెట్టిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తీరుపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు, విమర్శించే హక్కు అందరికీ ఉంటుందని, ఏ విమర్శ అయినా నిర్మాణాత్మకంగా, చట్టానికి లోబడి ఉండాలన్నారు.
కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం చట్టవ్యతిరేక చర్య అన్నారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలబెట్టాలని చెప్పడమంటే.. తెలంగాణ ప్రజలను అగౌరవపరచడమే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడిచేయడ మేనర్కొన్నారు. ‘ముందు కాలబెట్టు.. తర్వాత డబ్బులు వస్తాయి’ అని బీఆర్‌ఎస్ నాయకుడు మాట్లాడటం ఆందోళనకరమని, ఇవి చట్టవ్యతిరేక చర్యలను ప్రేరే పిం చడమేనని తెలిపారు.
ప్రభుత్వ ఆస్తుల విధ్వం సం, రైల్వే లైన్ల ధ్వంసం వంటి చర్యలు.. ప్రజల ప్రాణాలకు, దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయన్నారు. ఇలాంటి అపరిపక్వ వ్యాఖ్యలపై ప్రభు త్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌లో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోందని, దీంతో సమాజంలో హింస, భయా ందోళనలు, అరాచక వాతావరణం సృష్టించి రాజకీయ ప్రాధాన్యం పొందాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోం దని వివరించారు.
ఇదొక్క బీఆర్‌ఎస్ సమస్య మాత్రమే కాదని, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కూడా.. ఇలాగే రెచ్చగొట్టే రాజకీయాలకు కేంద్రబిందువుగా మారి ందన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రధానిమోదీ పట్ల, దేశ రాజ్యాంగ వ్యవస్థల పట్ల, పార్లమెంట్, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థల పట్ల అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను రెచ్చగొడుతూ, సమాజంలో అశాంతి సృష్టించే రాజకీయాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ తెలంగా ణలో శాంతి, అభివృద్ధి, బాధ్యతాయుత రాజకీయాల కోసం కట్టుబడి పనిచేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.






