calender_icon.png 29 July, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య రాజకీయ రణభేరి సభను విజయవంతం చేయాలి

28-07-2025 08:06:24 PM

జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు

గరిడేపల్లి (విజయక్రాంతి): ఆర్యవైశ్య రాజకీయ రణభేరి ఆగస్టు మూడున హైదరాబాదులో జరగనున్న సభకు ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు కోరారు. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం జరిగిన మండల ఆర్య వైశ్య సంఘం సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉంటూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు.

ఆర్యవైశ్యుల హక్కుల సాధన కోసం ఆర్యవైశ్య రాజకీయ రణభేరి సభకు ప్రతి గ్రామం నుండి ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆర్యవైశ్యుల సత్తా చాటి చెప్పాలన్నారు. అనంతరం వారు రణభేరి బహిరంగ సభ పోస్టర్ ను  ఆవిష్కరించారు.జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు సీట్లు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గరినే శ్రీధర్,మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరిగంటి శ్రీనివాస్,అదనపు ప్రధాన కార్యదర్శి నూనె నాగన్న,జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగంటి పురుషోత్తం,గెల్లి సతీష్,శ్రీరంగం ప్రసాద్,తాటికొండ లక్ష్మణ్,పైడిమర్రి నరసింహారావు,వీరమల్ల రమేష్,రత్నాకర్,బూరుగు శంకర్,పబ్బతి సురేష్,ఓరుగంటి వీరస్వామి,ఈగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.