28-07-2025 08:08:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్స్ డే(Grievance Day) కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల హాజరయ్యారు. నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.