02-02-2026 12:00:00 AM
ప్రేమవాహిని రథనికి బెజ్జంకిలో ఘన స్వాగతం
బెజ్జంకి, ఫిబ్రవరి 1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి (శతజ యంతి) ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర దేశవ్యాప్తంగా సాగుతోంది.జయంతి లో భా గంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఆదివారం బెజ్జంకి చేరుకోవటం జరి గింది. సత్యసాయి భక్తులు భజన మండలి ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతిలతో ఘనస్వాగతం పలికారు.మండలి సభ్యులు మాట్లాడుతూ శ్రీసత్యసాయి భగవానుని దివ్య వైభవాన్ని చాటుతూ పుట్టపర్తి నుండి బయలు దేరిన శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథం బెజ్జంకి చేరి గ్రామ వీధుల గుం డా తిరుగుచూ ప్రాంతాన్ని పావనం చేయ టం జరిగిందని తెలిపారు.
సత్యసాయి సేవా నిర్వాహకులు, విద్యార్థులు, భక్తులు వివిధ భక్తి ప్రదర్శన చేశారు. నృత్యాలు భజనలతో సందడి వాతావరణం నెలకొంది. దేవతామూర్తుల వేషధారణలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ సత్యసాయి సేవ సమితి బాధ్యులు,సర్పంచ్ శ్రీధర్,సుదర్శన్ రెడ్డి ,మోహన్ ,వివిధ హిందూ సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు,గ్రామస్తులు పాల్గొన్నారు.