బీఆర్ఎస్ నాయకుడిపై దాడి హేయం
03-06-2024 12:05 AM
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
మంచిర్యాల, జూన్ 2 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణ బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి గడప రాకేశ్‌పై దాడి హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రాకేశ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఎమ్మె ల్యేతో మాట్లాడారు. మంచిర్యాలలో రౌడీయిజానికి తెరలేవడం దురదృష్టకరమని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో ఇలాంటి అవాంచనీయ ఘటనలు జరుగలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు జరు గుతున్నా యో మంచిర్యాల ప్రజలు ఆలోచించాలని కోరారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






