calender_icon.png 9 February, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా బాబా శ్యామ్ నిషాన్ రథ్ యాత్ర

09-02-2026 12:51:07 AM

  1. వెల్లివిరిసిన భక్తి పారవశ్యం

అడుగడుగునా భక్తుల నీరాజనం

ముషీరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): బాబా శ్యామ్ (శ్రీ కృష్ణుడు) భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతూ ఫల్గుణి ఏకాదశి వేడుకలలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఆదివారం జరిగిన బాబా శ్యామ్ నిషాన్ (జండా) రథ్ యాత్ర అపూర్వమైన స్థాయిలో నగరం అంతటా భక్తి వాతావరణాన్ని సృష్టించి మంత్రముగ్ధులను చేసింది. ఈ యాత్ర చార్మినార్ మహా దేవ్ మందిరం నుండి కాచిగూడ శ్రీ శ్యామ్ బాబా మందిరం వరకు సాగిన ఈ కాలినడక యాత్రకు వివిధ మార్గాల్లో పూల వర్షం కురిపిస్తూ భక్తులు నిషాన్ యాత్రకు ఘన స్వాగతం పలికారు.

ఈ యాత్రలో బాబా శ్యామ్ రథశోభ యాత్ర కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్ అగర్వాల్, వైస్ చైర్మన్లు రామ్దేవ్ అగర్వాల్, పురుషోత్తం దాస్ గోయల్, కమిటీ సలహాదారు చంద్రకాంత్ డకోటియా,  కన్వీనర్లు అమిత్ అగర్వాల్, రాం నిరంజన్ అగర్వాల్, సంతోష్ అగర్వాల్, నర్సింగ్ జైస్వాల్, జీవన్ భాటి, అభిషేక్ శర్మ, సుశీల్ అగర్వాల, గోవింద్ పొద్దార్, శ్రీ శ్యామ్ మందిర్ సేవా సమితి అధ్యక్షులు చంద్రకాంత్ డకోటియా, ఉపాధ్యక్షులు కృష్ణ కుమార్ బడేగావ్వాలే, కార్యదర్శి ఇంద్రకరణ్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శులు  రామ్దేవ్ అగర్వాల్, రాజ్కుమార్ విగ్, కోశాధికారి  కపిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.