calender_icon.png 9 February, 2026 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి ప్రతీక గార్వీ షరీఫ్ ఉత్సవాలు

09-02-2026 12:49:51 AM

బీఆర్‌ఎస్ నాయకుడు అల్తాఫ్ రాజా

సికింద్రాబాద్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి): ఓల్డ్ బోయిన్‌పల్లి హస్మత్ పేట్ లోగార్వీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు అల్తాఫ్ రాజా ఆధ్వర్యంలో శనివారం రాత్రి గార్వి షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్,టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, బోర్డు మాజీ సభ్యు లు పాండు యాదవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరుల తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఓల్ బోయిన్ పల్లి షేర్ గల్లీ నుంచి హస్మత్ పేట్ మీదుగా అక్కడ నుంచి తిరిగి ఓల్ బోయిన్ పల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి జోన్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, ఏసీపీలు గోపాలకృష్ణ మూర్తి, సుబ్బయ్య, బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, అల్వాల్ ఇన్స్పెక్టర్  ప్రశాంత్ తమ సిబ్బందితో ఎలాంటి అవాంచనీయ సంఘట నలు జరుగకుండా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటే శ్వర రావు, దండుగుల యాదగిరి, చందు యాదవ్, బుర్రి యాదగిరి, మేకల హరినాథ్ మక్కలనర్సింగరావు, పప్పుపటేల్,కనకరాజు, అస్లాం, హమీద్, షహేన్షా పాల్గొన్నారు.