15 April, 2026 | 4:51 AM

బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు తప్పనిసరిగా తనిఖీ చేయాలి

16-12-2025 12:31 AM
  1. పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ స్థలాల పరిశీలన
  2. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్   పరిశీలన
  3. కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 17వ తేదీన పానుగల్, శ్రీరంగాపూర్, విపనగండ్ల, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ పాన్గల్, శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల్లో పర్యటించారు. 

పానగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆర్వో లతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మా ట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల గుర్తులు అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాతే సిబ్బందికి పంపిణీ చేయాలని ఆదేశించారు. 

పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ స్థలాల పరిశీలన

పానగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,  శ్రీరంగాపూర్ మండ ల కేంద్రంలోని సర్వవర్గ కమ్యూనిటీ హాల్, పెబ్బేరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణల్లో మంగళవారం పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కొరకు చేయనున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి గందరగోళం లేకుండా పోలింగ్ సామాగ్రి పంపిణీకిప్రణాళికబద్దంగా ఏర్పాట్లు చేయాలని సూచిం చారు.  

పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పరిశీలన

పానగల్, శ్రీరంగాపూర్, ప్భెర్ మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల పోలింగ్ పూర్తిగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓ లు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.  

మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి 

గద్వాల, డిసెంబర్ 15 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ మూడవ విడత  ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు 3వ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్ తో కలిసి మూడవ విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడవ ర్యాండమైజేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని, ఈనెల 17న ఎన్నికలు జరిగే జిల్లాలోని ఆలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో మొత్తం 700 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 1,00,372 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధుల నిర్వహణ విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.  డిపిఓ శ్రీకాంత్, ఈడియం శివ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.