calender_icon.png 16 December, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మోగ్లీ చిత్ర యూనిట్

16-12-2025 12:30:42 AM

హనుమకొండ, డిసెంబర్ 15(విజయ క్రాంతి):వరంగల్ మహానగరంలో చరిత్ర ప్ర సిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని సోమవారం మధ్యాహ్నం ఇటీవలే విడుదలయిన మోగ్లీచిత్రం హీరో శ్రీ రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్ మరియు చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈ సం దర్భంగా రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్లు చిత్రం పెద్ద హిట్ కావాలని అమ్మవారికి ప్ర త్యేక పూజలు నిర్వహింపజేశారు.

పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మహదా శీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అంద జేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లు తానుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కు మార్ రెడ్డి, మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, గౌండ్ల స్రవంతి, అసంతుల శ్రీనివాస్, పర్యవేక్షకులు కొంతికుమార్, సిబ్బంది తదితరులున్నారు.