14 August, 2026 | 8:27 PM

Breaking News

80వ స్వాతంత్య దినోత్సవం సందర్బంగా 80 ఆకారంలో పినాకిల్ పాఠశాల విద్యార్థులు   •   సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

2029లో బీసీలదే అధికారం

09-05-2026 12:23 AM

జెన్ జీ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే ప్రత్యేక రా ష్ట్రంలోనే బీసీలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన బీసీ విద్యార్థి యువజన రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.

రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతచారి నుంచి సిరిపురం యాదయ్య వరకు 1100 మంది బీసీలు బలిదానం చేశారని, బడుగులు బలిదానాలు చేస్తే ముఖ్యమంత్రి పీఠాల మీద అగ్రకులాలు కూర్చుని తీరని అన్యాయం తలపెడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాదిమంది బడుగు విద్యార్థుల చదువులకు భరోసా నింపిన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్రంలో అగ్రకుల ప్రభుత్వాలు జీవో 7ను విడుదల చేసి ఆ స్కీంకు ఉరి తీసిందన్నారు. 

జనాభాలో 60% పైగా ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా విస్మరిస్తున్నాయని, అగ్రకుల రాజకీయ పార్టీలను 2029 నాటికి గోరికట్టి తీరుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. నేపాలో విద్యార్థులు యువత ఏ విధంగా జెన్ జీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువచ్చి రాజకీయ సునామీని సృష్టించి అవి నీతిపరులను, రాజకీయ తిమింగలాలను తరిమికొట్టినట్టే ఇక్కడ కూడా బీసీ విద్యార్థి యువజనులు జట్టు గట్టి బీసీల రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు సాగాలని జాజుల పిలుపునిచ్చారు.

కాగా హైదరాబాద్‌కి చెందిన గోధ అరుణ్ కుమార్‌గౌడ్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు జాజుల ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ బీసీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా వి మణికంఠ, ఉపాధ్యక్షులుగా జే జస్వంత్ ఎల్బీనగర్ జోన్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సీహెచ్ జయరాం, నాగోల్ జోన్ కా ర్యవర్గ అధ్యక్షులుగా సీహెచ్ ప్రశాంత్‌ను నియ మించారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు గుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్,  యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ తదితరులున్నారు.