9 May, 2026 | 1:45 AM

ఇబ్రహీంపేట్‌లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం

09-05-2026 12:22 AM

సర్పంచ్ సంధ్యా రాజ్ కుమార్

బాన్సువాడ, మే 8 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవికాలన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు వేసవి తాపం నుండి ఉపశమనం కల్పించడానికి గ్రామంలోని బస్టాండ్ వద్ద అంబలి కేంద్రం చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్  సంధ్య రాజ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి నాగరాజు, నాయకులు,వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు.