calender_icon.png 15 December, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అందని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు

13-12-2025 12:00:00 AM

గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య

భద్రాచలం, డిసెంబర్12, (విజయక్రాంతి) :భద్రాచలం శాసనసభ పరిధిలో ఉన్న నిజమైన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రభుత్వ ఫలాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందకుండా తీవ్ర అన్యాయం జరుగుతుందని భద్రాచలం మాజీ శాసనసభ్యులు మరియు అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొడియం వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రాచలం పట్టణ కాంగ్రెస్ కార్యాలయం లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన కార్యకర్తలను నాయకులను అభిమానులను ప్రస్తుత శాసనసభ్యులు తెల్ల వెంకటరావు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నట్లు పొదేం వీరయ్య ఆరోపించారు. ప్రస్తుతం నిజమైన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతుందని, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లనట్లు తెలిపారు.

ప్రస్తుతం వలస వాదులకు పెద్దపీట వేసి అసలైన కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని దీనిపై సరైన సమయంలో సమాధానం చెబుతామని అని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నానని, తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో అనేక ప్రలోభాలు వచ్చినప్పటికీ పార్టీని వీడలేదని అన్నారు.

తనలాంటి భద్రాచలం నియోజకవర్గం లో ఎంతో మంది ఉన్నారని వారిని విస్మరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి అన్ని విభాగాలలోను రాజకీయ పదవుల లోను నిజమైన కార్యకర్తలకు కూడా సముచిత స్థానం కల్పించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు టీ వెంకటేశ్వరరావు ఆదినారాయణ తో పాటు నాయకులు గెలిచిన వార్డు మెంబర్లు పాల్గొన్నారు.