13-12-2025 12:00:00 AM
సిరికొండ డిసెంబర్ 12:(విజయ క్రాంతి): సిరికొండ మండలంలో విద్యుత్ శాఖలో నెలకొన్న , అవినీతి అక్రమాలు ఇటీవల వెలుగులోకి రావడంతో గ్రామాల్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాడి, గడ్కోల్, రామడుగు, కొండూరు, పెద్ద వాల్గోట్, చిన్న వాల్గోట్ గ్రామాల్లో విద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం, తీగలు తెగిపోవడం, స్తంభాలు కూలిపోవడం వల్ల గ్రామా ల్లో విద్యుత్ సరఫరా దాదాపు స్తంభించిన ఈ ప్రజలు రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా ప్రకటించరూ ఒక్క రైతు కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు& అన్ని మరమ్మత్తులు విద్యుత్ శాఖే నిర్వహిస్తుంది. ఇచ్చిన ఆదేశాలను ఆదేశాలను స్థానిక అధి కారులు పట్టించుకోవడం లేదు.
సిరికొండ మండల విద్యుత్ శాఖ అధికారులు తమఇష్టఅను సారంగా వివరిస్తూన్నారన్న ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయి. గ్రామాల్లో సాధారణ పనులు జరగాలంటే కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారూ. రైతు నుండి 4,723 రూపాయలు ఖర్చు చేయించి ట్రాన్స్ఫార్మర్ బిగింపు. చిన్న వాల్గోట్కు చెందిన ఓ రైతు తన ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడంతో మరమ్మత్తు కోరగా, సంబంధిత సిబ్బంది నుండి ఈ ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది.
ఎల్.టి సెట్స్, ఎర్తింగ్ రాడ్స్, నట్టు-బోల్టులు మీరు కొనుక్కొని ప్రైవేట్లో తీసుకురండి& మేము పని చేస్తాం. అని స్థానిక విద్యుత్ అధికారుల నుండి సమాధానం వచ్చిం దనం రావడంతో ఖంగు తిన్న రైతు చేతిలో చిల్లి గవ్వలేక దిక్కుతోచని స్థితిలోఉన్నారు.
ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా రైతును ప్రైవేట్ దుకాణానికి వెళ్ళేలా చేసి, 4,723 ఖర్చు పెట్టించారు. తర్వాత ఆ సామగ్రితో ట్రాన్స్ఫార్మర్ బిగించారని గ్రామస్తులు చెబుతున్నారు.ఇంకా ఆశ్చర్యమేమం టే& రైతు కొనుగోలు చేసిన వస్తువుల బిల్లులను విద్యుత్ శాఖ అధికారులు తమ పేరిట క్లెయిమ్ చేసు కుంటున్నారన్న అనుమానాలు మండలంలో చర్చ జరుగుతోంది.
రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఈ విషయంపై విజయ క్రాంతి ప్రతినిధి ఏ.ఈ.ను ప్రశ్నించగా ...మా వద్ద స్టాక్ లేకపోవడంతోనే రైతులు తెచ్చుకోవాలి. అది తీసుకొస్తే ఇప్పుడే పని పూర్తవుతుంది అని చెప్పడం మరింత వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై వెంటనే జిల్లా డి.ఈ.ను సంప్రదించగా, ఆయన స్పష్టం చేస్తూ రైతులు ఏ వస్తువూ కొనాల్సిన అవసరం లేదు& అన్ని సామగ్రి శాఖదే.
ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వండి& వెంటనే చర్యలు తీసుకుంటాం అన్నారు.విద్యుత్ శాఖ సిబ్బంది చిన్న మరమ్మత్తులకే డబ్బులు డిమాండ్ చేస్తున్నారం టూ గ్రామాలన్నిట్లో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.డబ్బులు లేకపోతే పని చేయరు& చెప్పినా వినరు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
సిరికొండ మండలం మొత్తంలో విద్యుత్ శాఖ అవినీతి విస్తరించిందని భావిస్తున్న ప్రజలు, దీనిపై జిల్లా స్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్య తీసుకునే సమయం ఆసన్నమైందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.