calender_icon.png 15 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డయాలసిస్‌లో అత్యుత్తమ వైద్యసేవలు

15-11-2025 12:00:00 AM

  1. తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి సేవలు భేష్

రెండు జాతీయ, నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులు సొంతం

తూప్రాన్, నవంబర్ 14 :డయాలసిస్ సేవల్లో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తూ జాతీ య స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులను తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని 50 పడగల ప్రభుత్వ ఆసుపత్రి సొంతం చేసుకుంది. గత సంవత్సరంలో వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీ దుగా డయాలసిస్ ప్రారంభించడం జరిగిం ది.

కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ వారికి కావాల్సిన రీతిలో మెరుగైన డయాలసిస్ సే వలను అందిస్తూ ఏడాదిలో రెండవ సారి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. కమ్యూనిటీ హెల్త్ సెం టర్ లో తక్కువ సమయంలో ఎక్కువ సైకి ల్స్ పూర్తి చేసి తూప్రాన్ పీహెచ్సీ జాతీయ స్థాయిలో నిలిచింది.

మెదక్ జిల్లాలో నాలు గు మెరుగైన వైద్య శాలలు ఉన్నా తూప్రాన్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చే గుంట, మాసాయిపేట్, వెల్దుర్తి, శివంపేట్ పలు మండలాల నుండి కిడ్నీ, ఇతర రోగు లు ఇక్కడికి చేరుకొని మెరుగైన వైద్యాన్ని అందుకుంటున్నారు. ప్రారంభ దశలో నాలుగు బెడ్లతో ఉన్న ఈ డయాలసిస్ సెంటర్ రోజుకు 16 మందికి డయాలసిస్ వైద్యాన్ని అందిస్తున్నారు.

ప్రారంభ దశ నుండి ఇప్పటివరకు డయాలసిస్ లో పదివేల మందికి నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు తూప్రాన్ మాజీ ఎంపీటీసీ ఎక్కలదేవ్ వెంకటేశ్ మాట్లాడుతూ ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ అవార్డులు సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ఉత్తమ సేవలు అందిస్తున్నాం..

2018 లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ హాస్పిటల్ నేటి వర కు ఆరు అవార్డులను కైవసం చేసుకోవ డం జరిగింది. ఇందులో కాయకల్ప వి భాగంలో నాలుగు అవార్డులను, క మాండేషన్ లక్ష్యా విభాగంలో ఎన్క్వాస్ రెండు జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకోవడం జరిగిందని మొ త్తం ఆరు అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది. ఇకమీదట ఇదే స్థాయి లో రోగులకు అత్యుత్తమ సేవలను అందిస్తూ ముందుకు వెళ్తాం.

డాక్టర్ అమర్ సింగ్