14-11-2025 11:34:13 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల ఎన్ఆర్ఇజిఎస్ అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ గా ఎండి .రజియా సుల్తానా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బెల్లంపల్లి మండలం లో ఏ పీ ఓ గా పనిచేసిన ఏస్టర్ డేవిడ్ బదిలీ కాగా ఆమె స్థానంలో మందమర్రిలో పనిచేస్తున్న రజియా సుల్తానాకు బెల్లంపల్లిలో పోస్టింగ్ ఇచ్చారు. గతంలో రజియా సుల్తానా బెల్లంపల్లి మండల ఏపీవోగా పనిచేసే గ్రామీణ ప్రాంత ప్రజల మన్ననలు పొందారు.