11 August, 2026 | 1:52 AM

దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన బీజేపీ ప్రభుత్వం

11-08-2026 12:00 AM
  1. బీజేపీ పాలనలో రాముడికే రక్షణ లేదు
  2. అక్రమార్కులకు బీజేపీ అడ్డ్డాగా ఉంది
  3. మార్పుకై సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ
  4. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
  5. హనుమకొండ మండలంలో సీపీఐ ప్రచార జాతా

హనుమకొండ, (మహబూబాబాద్) ఆగస్టు 10 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన ఘనతను సొంతం చేసుకుందని, రామభక్తులం అని చెప్పుకునే మోడీ, అమిత్ షా, బిజెపి నేతలు వారి పాలనలో అయోధ్య రాముడికి రక్షణ లేకుండా పోయిందని, అక్రమార్కులకు బిజెపి అడ్డగా ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.

సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6న కాజీపేటలో ప్రారంభమైన సిపిఐ ప్రచార జాత యాత్ర సోమవారం 5వ రోజున హనుమకొండ మండలానికి చేరుకొని జీటి రెడ్డి నగర్ నుండి ప్రచార జాతా పాదయాత్ర  పుర వీధుల మీదగా పలువేల్పుల వరకు ఉత్సాహపూరితంగా సాగింది. ఈ సందర్భంగా హనుమాన్ నగర్ చేపల బ్రిడ్జి వద్ద జాతా బృందానికి హనుమకొండ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

అలాగే హనుమాన్ నగర్ లో రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్ ఆధ్వర్యంలో పూలమాలలతో స్వాగతం పలుకగా బతుకమ్మలతో, కోలాట బృందాలతో జాత పాదయాత్ర కొనసాగింది. హనుమాన్ నగర్ కేంద్రంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైనా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రామభక్తులం అని చెప్పుకునే మోడీ, అమిత్ షా, బిజెపి నేతలు వారి పాలనలో అయోధ్య రామాలయం రూ.200 కోట్ల రూపాయల చోరీ చోరీ జరిగితే ఇంతవరకు విచారణ చేయలేదన్నారు.

అయోధ్య రామాలయం రూ.200 కోట్ల రూపాయల చోరీపై రామ భక్తులకు మోడీ, షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అక్రమార్కులకు బిజెపి అడ్డగా ఉందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం వంద రోజులలో నిత్యవసర వస్తువుల ధరలు అదుపులోకి తెచ్చి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని, నిరుద్యోగులకు ఉపాధి కోసం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాటలు అధికారం చేపట్టిన తర్వాత నీటి మూటలే అయ్యాయని వారు ఆరోపించారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత యూపీఏ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని ఆకాశాన్ని అంటుతున్నాయని, మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గించి ప్రజల కొనుగోలు శక్తి చేసే విధంగా అందుబాటులోకి తీసుకువస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తీసుకువస్తే రైతులు తిరుగుబాటు చేసినందున కేంద్ర ప్రభుత్వం ఆయా నల్ల చట్టాలను వెనక్కు తీసుకోక తప్పలేదని అన్నారు.

వ్యవసారంగానికి సబ్సిడీ ఎత్తివేశారని, గిట్టుబాటు ధరలు లేవని, విదేశాలలో మొలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామని చెప్పి పెద్ద నోట్ల మార్పిడి చేసి ఏ ఒక్కరి పైన ఇంత వరకు చర్య తీసుకుపోవడం పాపన పోలేదని అన్నారు. బ్యాంకులను, ఎల్‌ఐసి, రైల్వేలను, రక్షణ రంగం తదితర వాటిని ప్రైవేటుపరం చేసే దిశగా మార్చడం దేశ దౌర్భాగ్యానికి నిదర్శనమని అన్నారు.

బిజెపి పాలనకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పాదయాత్రలు ఆగస్టు 6 నుండి ప్రారంభమైన ఈ దేశవ్యాప్త పాదయాత్రలు వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల గుండా సాగుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, ఈ జాత ద్వారా  కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజా సమస్యల పైన పోరాటాలు కొనసాగిస్తూ మార్పు రావాలి మోడీ ప్రభుత్వం దిగాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీన ఛలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 6వ తేదీ నుండి 11వ తేది వరకు జరిగే సిపిఐ ప్రచార జాత పాదయాత్రలను, సెప్టెంబర్ 1 తేదీన డిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగబో బద్లావ్ జరూరిహై ర్యాలీతో ముగుస్తాయని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో డిల్లీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ జిల్లా నాయకులు మునిగాల బిక్షపతి, కర్రె లక్ష్మణ్, కొట్టెపాక రవి,యేషబోయిన శ్రీనివాస్, మాలోత్ శంకర్ నాయక్, శనిగరపు రాజ్ కుమార్, రసమల్ల దీన, దామెర సుదర్శన్, అలువాల రాజు, మండల నాయకులు పొనుగోటి రాముగోపాల్ చారి, పూజారి అమృతయ్య, మామునూరి దామోదర్, కేతపాక ప్రసాద్, తాటికొండ ప్రశాంత్, మాలోత్ మంగ, తాటికంటి మమత, నలువాల సంధ్య, గుంటీ రజిత ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు గడ్డం రాజనర్సు, రోంటాల శ్యామ్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.