8 May, 2026 | 3:02 AM

బీసీలకు బీజేపీ చేసిందేమీ లేదు

08-05-2026 01:39 AM
  1. 10 ప్రశ్నలకు జవాబు చెప్పాకే ప్రధాని రావాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయఅధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): గత 11 ఏళ్ల పాలనలో బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ పదవి బాధ్యతలు చేపట్టినా బీసీ కులగణన చేపడతామని చెప్పి చేయకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా బీసీలు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిన 10 ప్రశ్నలతో కూడిన ఓ ప్రకటనను గురువారం జాజుల విడుదల చేశారు. బీసీ సమగ్ర కుల గణనపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం, ఓబీసీ కుటుంబాలను ఎందుకు లెక్కించడం లేదు, మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఎందుకు కల్పించడం లేదు, 42 శాతం రిజర్వేషన్లను ఎందుకు ఆమోదించడం లేదన్నారు. 

ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ కో కన్వీనర్ ఉప్పరి శేఖర్ సగర, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మనిమంజరి సాగర్, టీజేఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జస్వంత్ కుమార్, డెమొక్రటిక్ ఫ్రంట్ చైర్మన్ కోల జనార్దన్ గౌడ్, బూడిద మల్లికార్జున్ యాదవ్, పానుగంటి విజయ్ గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, ఉదయ్ నేత, విజయలక్ష్మి, ఆంజనేయులు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.