calender_icon.png 20 December, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ బలమైన శక్తిగా అవతరించింది

19-12-2025 01:59:03 AM

  1. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి చెప్తాం 

బిజెపి గన్నేరువరం మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్

గన్నేరువరం, డిసెంబర్18(విజయక్రాంతి): గన్నేరువరం మండలంలో బిజెపి తిరుగులేని రాజకీయ శక్తి గా అవతరించిందని , జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ , బిఆర్‌ఎస్  ల కుట్రలు కుతంత్రాలను, డబ్బు మద్యం ప్రలోభాలను తట్టుకొని బరిలో నిలిచి, నాలుగు సర్పంచి స్థానాలను కైవసం చేసుకుందని బిజెపి మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ తెలిపారు. బుధవారం రోజున గన్నేరువరంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ లు  పంచాయితీ ఎన్నికల్లో  అధికారం పొందడం కోసం   అనేక అడ్డదారులు తొక్కిందన్నారు.

మండలంలోని అనేక గ్రామాల్లో డబ్బు ,మద్యం తో అనేక ప్రలోభాలతో  ఓటర్లను ప్రభావితం చేశారని , మండల కేంద్రమైన గన్నేరువరంలో కూడా  అలాంటి పరిస్థితులు ఉండడంతోనే  బిజెపి అభ్యర్థి   ఓటమి చెందడం జరిగిందని తెలిపారు. కేంద్ర మంత్రి  బండి సంజయ్ కుమార్, బిజెపి జిల్లా  నాయకత్వ దిశా నిర్దేశం కు  అనుగుణంగా  మండలంలోని బిజెపి శ్రేణులు  ఎన్నికల కోసం  నిర్విరామంగా పనిచేశారని తెలిపారు.

త్వరలో జరగబోయే ఎంపిటిసి,  జడ్పిటిసి ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి, జడ్పిటిసి , ఎంపిటిసి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు మచ్చ బాలరా జు, పుల్లెల రాము, పుల్లెల జగన్, సందవేణి ప్రశాంత్ యాదవ్, 8వ వార్డు సభ్యులు మచ్చ సాయికృష్ణ,జాడిగం వినయ్, టేకు అనిల్, సిరిగిరి తిరుపతి పాల్గొన్నారు