7 April, 2026 | 2:21 AM

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ

07-04-2026 12:00 AM

పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యే వెల్లడి

ఆదిలాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): దేశంతో పాటు ధర్మ పరిరక్షకై ఏర్పాడిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూ హౌజింగ్ బోర్డులో గల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ గోడం సగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ అధ్యక్షుడు బ్రహ్మనంద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతమాత, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాలు ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎండీ గోడం నగేష్ మాట్లాడుతూ... దూరదృష్టితో అనాదు జనసంఘ్ పార్టీ ఏర్పడి కాలక్రమేనా బీజేపీగా అవితరించిందన్నారు. పార్టీ నిర్మాణం, ప్రజాస్వామ్య పరిరక్షణ, నితీ, నిబద్ధతతో కూడిన బీజేపీలో పని చేయడం గర్వకారణమన్నారు. ప్రతి దేశ పౌరునికి భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో బీజేపీ అవతరించిందన్నారు. అనాడు వాజ్పేయి... నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో నీతివంతమైన పరిపాలన సాగుతుందన్నారు. బీజేపీని మరింత బలోవేతం చేసేందుకు యువత పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... అనాడు ఐదుగురు సభ్యులతో ప్రారంభమై నేడు కోట్లది మంది సభ్యుల తో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు. బీజేపీలో పని చేయడం అంటే దేశ రక్షణకు నైన్యంలో పని చేసినంత తృప్తి లభిస్తుందన్నారు. ఇప్పటికే 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు గెలుపొందగా తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య నైతం వెరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో బీజేపీ రానున్న ఎన్నికల్లో తెలంగాణాలో నైతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయ ర్ విజయ్, వేదా వ్యాన్, జోగు రవి, పోశన్న, గంట జీవన్, బోడిగాం శ్రీకాంత్, రాకేష్, నగేశ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.