సీఎంపీఎఫ్ చిట్టీలు ఎప్పుడిస్తారు
సీఐటీయూ అధ్యక్షుడు బాలాజీ
మంచిర్యాల, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సిన సీఎంపీఎఫ్ చిట్టీలు సింగరేణి సంస్థ గత నాలుగైదు ఏం డ్లుగా ఇవ్వడం లేదని, ఇంకా ఎపుడిస్తుందని సీఐటీయూ అధ్యక్షులు గుల్ల బాలాజీ ప్రశ్నించారు. సోమవారం సిఐటియు వ్యవస్థాపక సభ్యులు బీటీ రణ దివే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం సీఐటీయూ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
సింగరేణి కార్మికులకు గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి సీఎంపీఎం చిట్టీలు ఇవ్వడం లేదనీ, దీనివల్ల కార్మికు ల పట్టు పైసలు జమ అవుతున్నాయో, లేదో తెలియడం లేదని, ఈ డబ్బులు ఏమైనా పక్కదారి పడుతున్నాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీనిపై సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రతి సంవ త్సరం కట్టవలసిన వడ్డీ రేటును తక్కువగా కడుతూ కార్మికులను సిఎంపిఎఫ్ మోసగిస్తున్నారని, పారదర్శకంగా ఉండడం కోసం కార్మి కుల యొక్క మొబైల్ లో ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేస్తున్నామని, నిలువలు చూపెట్టడానికి తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు, కానీ ఆచరణలో అలాంటివి ఏమీ జరగడం లేదని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా కార్మికులకు భరోసా కల్పిస్తూ, వారి సీఎం పిఎఫ్ అమౌంట్‌ను గతంలో మాదిరిగా చిట్టిల రూపంలో ప్రతి కార్మికునికి అందజేయాలని, లేనిపక్షంలో కార్మికులు చేపట్టబోయే ఆందోళనకు సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. గెలిచిన ప్రాథమిక సంఘాలు కార్మికుల యొక్క మౌలిక సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం చెప్పు చేతుల్లో ఉంటున్నారని, ఆర్ ఎల్ సీ ఇచ్చిన రెండు సంవత్సరాల కాల పరిమితి ముగిసినందున వెంటనే అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిళ్ళ శ్రీనివాస్, పెరుక సదానందం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.




