31 May, 2026 | 1:03 AM

బీజేపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి

31-05-2026 12:00 AM
  1. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ‘ఏకాత్మత మానవ వాదం’మే బీజేపీ బలం
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  3. కరీంనగర్ జిల్లాలో బీజేపీ ప్రశిక్షణా తరగతులు

మనకొండూర్, మే 30 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ బీజేపీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పార్టీనాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ‘ఏకాత్మత మానవ వాదం’ సిద్ధాంతమే బీజేపీ బలమని తెలిపారు. పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని కమల దళానికి శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. 

తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్‌లో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో రామచందర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లా డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఓ ఫెయిల్యూర్  గవర్నమెంట్ అని  విమర్శించారు.  బీజేపీ నేతలు అయ్యంగారు ప్రభాకర్‌రెడ్డి, దేవకి వాసుదేవారావు, అల్జాపూర్ శ్రీనివాస్, బండారి శాంతికుమార్, రాణి రుద్రమ మాట్లాడారు.  మాజీ మంత్రి సుద్దాల దేవయ్య,  మా జీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ నాయకురాలు బొడిగే శోభ తదితరులున్నారు.