వైభవంగా బోనాల జాతర ఊరంతా పండగ
-బోనం ఎత్తుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు, నవంబర్ 16 (విజయక్రాంతి): తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో అడెల్లి పోచ్చ మ్మ ఉపాసకులు మల్లయ్య దేవుడు నిర్మించిన పోచ్చమ్మ అమ్మవారి ఆల యం 5వ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంను పురస్కరించుకొని గ్రామంలో బోనాల జాతరను ఘనంగా చేపట్టారు.
ఊరి పొలిమేరలో ఉన్న గ్రామ దేవత కు గ్రామ ఆడపడుచులు భక్తిశ్రద్ధల తో సామూహిక బోనాలను డప్పుచప్పుళ్ళు ,బాజా భజంత్రీ నడుమ శివసత్తుల విన్యాసాల చేస్తు బోనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిధిగా హాజరై బోనం కుండను ఎత్తుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అమ్మ వారి ఉపాసకులు మల్లయ్య దేవుడు అకుంఠిత దీక్షతో గ్రామంలో అడెల్లి పోచ్చమ్మ అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ప్రతి ఏడు రైతులు పంటలు పండించి ఇంటికి వచ్చిన సమయంలో కృతజ్ఞతతో గ్రామ దేవతకు బోనాలను సమర్పించే ఆనవాయితీ తీసుకురావడం అభినందనీయమన్నారు.
అమ్మ వారి ఆశీస్సుల తో గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిం చారు. అనంతరం అమ్మవారి ఉపాసకులు మల్లయ్య దేవుడు మాట్లాడుతూ జీవితం మొత్తం అమ్మవారి ఆరాధనకి అంకితం చేయడం జరిగిందని గత 40 సంవత్సరాలుగా అమ్మవారిని కొలుస్తున్నానని, గ్రామస్తుల సహకారం, అమ్మ వారి కృపతో ఆలయం నిర్మాణం చేప ట్టి వార్షికోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్, నాయకులు మొట్టే కిరణ్, అభిరామ్ రెడ్డి, అబ్దుల్లా గ్రామస్థులు తోట శ్రీనివాస్, జనార్ధన్, జక్కుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






