17-11-2025 12:00:00 AM
-మిస్సింగ్ కేసు నమోదు
మందమర్రి, నవంబర్ 16: పట్టణ పోలీస్ స్టే షన్ పరిధిలో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతికి కారణమైన ఆటో ట్రాలీ డ్రైవర్ దేవి చంద్రయ్య అదృశ్యం అయ్యాడని ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర రాజశేఖర్ తెలిపారు. ఆదివారం ఆయ న విలేకరులతో మాట్లాడారు.
ఈ నెల 13న పట్టణంలోని బురదగూడెం మద ర్సా సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చి న ఆటో ట్రాలీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నడుపు తున్న వోలపు నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదస్థలం నుండి కొద్ది దూరంలో ఆటో ట్రాలీని వదిలిపెట్టిన డ్రైవర్ చంద్రయ్య అదే రోజు నుండి కనిపించక పోవడంతో, ఆయన కుటుంబ సభ్యులు బంధువులు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభిం చలేదు.
డ్రైవర్ ఆచూకీ తెలిసిన వారు 8712656570 నెంబర్‌కు, లేదా పట్టణ పోలీసులకు సమాచారం అం దించాలన్నారు. ఈ మేరకు అతని భార్య దేవి భూలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.