17-11-2025 12:00:00 AM
అన్నదాతల భూ సమస్యలు తీరేదెన్నడు
దౌల్తాబాద్,నవంబర్ 16: ధరణి పోర్టల్ భూ సమస్యలు పెరిగిపోయాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటికి పరిష్కా రంగా ’భూ భారతి’ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను ఏ ర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నప్పటికీ,వాటి పరిష్కారంలో తీవ్ర జాప్యం జరు గుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి అధికారులు సమస్యలను పరిశీలించి నివేదికలు సమర్పించడంలో ఆలస్యం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
నామ మాత్రంగా సమస్యల పరిష్కారం...
భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవు తోంది. ఒక సమస్యకు అనేకసార్లు దరఖాస్తు లు చేసినా ఫలితం లేదనే ప్రచారం సాగుతోంది. తహశీల్దార్, ఆర్టీఓ స్థాయిల్లో పను లు కొంతవరకు అవుతున్నప్పటికీ, అదనపు కలెక్టర్ లేదా కలెక్టర్ లాగిన్ తో పరిష్కారం కావాల్సిన పనుల్లోనే అత్యధిక పెండింగ్ ఉంటోందని లబ్దిదారులు లబోదిబోమంటున్నారు.
నిషేధిత జాబితాలో భూమి పడటం, పేరు, చిరునామా తప్పుగా ఉండటం, డేటా సరిదిద్దడం వంటి అంశాల పరిష్కారానికి అదనపు కలెక్టర్ వద్దే నిలిచిపో తున్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో తిరస్కరణకు గురైతే, ఆ రుసుము కూడా తిరిగి రైతుకు చేరే పరిస్థితు లు లేవు. దీంతో భూ భారతి వచ్చిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకున్న ఫలితం లేదని లబ్దిదారులు వాపోతున్నారు.
ధరఖాస్తు స్థితి తెలియక..
మండలంలో ధరణి,భూ భారతి పోర్టళ్లు వచ్చినప్పటి నుంచి సాధ బైనామా కొరకు 2899 ధరఖాస్తులు రాగా 1533 ధరఖాస్తు లు తిరస్కరించగా,1385 ధరఖాస్తులు విచారణ జరిపి ఆర్డీవో కార్యాలయానికి పంపిం చారు. ఇంకా 591 ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.
మిస్సింగ్ సర్వే నెంబర్, పేరు మార్పు..
భూమి స్వభావం మార్పు, నిషేధిత జాబితాలో ఉన్న సవరణ,పెండింగ్ మ్యూటేషన్, డీఎస్ పెండింగ్,విస్తీర్ణం సవరణ,పౌతి వంటి తదితర సమస్యల పరిష్కారం కొరకు 510 ధరఖాస్తులు రాగా 439 ధరఖాస్తులు తిరస్కరించగా 71 ధరఖాస్తులు ఆమెదించారు. క్లియర్ అయిన వాటిలోనూ కేవలం 25 శా తం మందికే భూ సమస్య పూర్తిగా పరిష్కారమైందని, మిగిలిన 75 శాతం మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారని సమాచా రం.
ముఖ్యంగా, నిషేధిత భూముల జాబితాలో పడిన పట్టా భూములకు దరఖాస్తు చే సుకున్న వారికి ఆ దరఖాస్తు ఎక్కడ పెండిం గ్లో ఉందో లేదా దాని స్టేటస్ ఏమిటో పో ర్టల్లో కనిపిం చడం లేదు. గతంలో దరఖాస్తు సంఖ్యను నమోదు చేస్తే ఏ అధికారి వద్ద పెండింగ్లో ఉందో కనిపించేదని, ఇప్పుడు ఆ వివరాలు కూడా బహిర్గతం కాకపోవడంతో బాధితులు తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్ కా ర్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాదా బైనామా ద్వారా 2006 సంవత్సరంలో భూమి కొనుగోలు చేసినా, ఇప్పటికీ పట్టా నా పేరుపై కాలేదు . రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్ప టివరకు సమస్యకు పరిష్కారం లభించలేదు .కష్టపడి సాగుచేసే భూమిపై హ క్కు కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నా అధికారులు నా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా.
గంగాధరి నర్సింలు (రైతు)
ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సర్వే నెంబర్ మిస్సింగ్, సాధా బైనామా, వి స్తీర్ణం మార్పు కొరకు దరఖాస్తు చేసుకు న్న సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలే దు. తహశీల్దార్ కార్యాలయంలో అడిగితే మా పరిధిలో లేదు అనే సమాధా నం మాత్రమే వస్తోంది భూమి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియక అయోమయంగా ఉంది.
పంచమి సంజీవ్ (రైతు)
మండలంలో నిర్వహించిన రెవెన్యూ సద స్సులో భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణంగా పరిశీలిస్తున్నాం. రికార్డులు, మోకా వివరాల్లో వ్యత్యాసం ఉన్న దరఖాస్తులను తిరస్కరించాము. ప్రతి రైతు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు కొనసాగుతున్నాయి.
చంద్రశేఖర్ రావు (దౌల్తాబాద్ తహశీల్దార్)