1 May, 2026 | 2:05 AM

పులికి ఆవాసంగా మారిన బోథ్ అడవులు

01-05-2026 12:00 AM

బోథ్, ఏప్రిల్ ౩౦ (విజయక్రాంతి): మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోని పడవలు పులులకు ఆవాసంగా మారాయి. గత నాలుగు సంవత్సరాల కాలంగా బోథ్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పులి సంచరిస్తూనే ఉంది. పులి సంచారం పై అటవీ శాఖ అధికారులు అప్పుడప్పుడు అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

అయితే గురువారం ఉదయం నాలు గు గంటల ప్రాంతంలో బోథ్ అడవుల్లో నీ కైలాస్ టేకిడికి వెళ్లే రహదారిపై పులి కనిపించడంతో ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. పులి తన రూట్లో అది వెళ్లి పోవడంతో చూసినవారు ఊపిరి పీల్చుకున్నారు.  బోథ్ అడవుల్లో పులి చిరుతల సంచారంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు.