వైద్య సేవలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాం
ఆసుపత్రి తనిఖీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ఏప్రిల్ ౩౦ (విజయక్రాంతి): బోథ్ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పరంగా అందే వైద్యం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గురువారం బూత్ ఆసుపత్రిని సందర్శించి సంబంధిత వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉందని సూపరిండెంట్ రవీంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది.
ఆస్పత్రిలో వైద్యుల కొరత తీర్చాలని కోరారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత వల్ల బయటకు రావద్దని సూచించారు. త్వరలోనే నూతన ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక వైద్యులతో పాటు విద్యుత్ శాఖ ఏఈ సర్పంచ్ అన్నపూర్ణ ఉన్నారు.






