29 August, 2026 | 12:01 AM

కందాళకు రాఖీ కట్టిన పెళ్ళి కూతురు

29-08-2026 12:00 AM

ఖమ్మం, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఎన్నికలు, రాజకీయాలు, గెలుపోటములు వేరు.. కానీ ప్రజల మనసులు గెలుచుకోవడం అంటే ఇదేనేమో.. పెండ్లి పీటల పైనుంచి నవవధువు స్వయంగా మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి రాఖీ కట్టి తన సోదరుడిగా అపారమైన అభిమానాన్ని చాటుకున్న హృద్యమైన దృశ్యమిది. ఒక రాజకీయ నాయకుడికి ప్రజల నుండి కేవలం ఓట్లే కాకుండా, ఇలాంటి రక్తసంబంధాన్ని మించిన పవిత్రమైన ఆప్యాయతలు దక్కడం నిజంగా ఆయన ప్రజాసేవకు చిక్కిన అసలైన రివార్డ్.

పదవులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటిలోనూ ఒక అన్నలా, పెద్ద దిక్కులా నిలుస్తున్న ఉపేందర్ రెడ్డి మంచితûానికి ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనం! కూసుమంచి మండలం పెరికిసింగారం గ్రామానికి చెందిన వారి వివాహ వేడుక కూసుమంచి గ్రామంలోని విజయరామ పంక్షన్ హాల్ లో జరుగుతోంది. నవదంపతులను ఆశీర్వదించేందుకు పంక్షన్ హాల్ కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కీ పీఠల మీద కుర్చున్న పెళ్ళి కూతురు మాజీ ఎమ్మెల్యే కు రాఖీ కట్టింది. దీంతో కందాళ తన సోదరి భావంతో ఆశీర్వదించారు. ఈ సంఘటన బందువులను ఆశ్చర్యపరిచింది