15 August, 2026 | 1:48 AM

రైతుకు పెట్టుబడుల భారం

15-08-2026 12:53 AM

ఓవైపు వర్షభావంతో రైతుల ఇబ్బందులు 

మరోవైపు భారీగా పెరిగిన ఎరువుల ధరలు 

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పూత కాత లేని పత్తి పంట

ఆందోళనలో పత్తి రైతులు

రైతు సాగు చేస్తున్న పత్తి పంట

వాంకిడి, ఆగస్టు 14 (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులకు తోడు ఎరువుల ధర లు పెరగడంతో పత్తి రైతులకు పెట్టుబడి భా రం రెట్టింపు అవుతుంది. పంట ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడంతో వాంకి డి మండల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసిన మొదట్లోనే వ ర్షాలు లేకపోవడం పత్తి పత్తి సాగుకు ఇబ్బందికరంగా మారింది.

వితిన చోట నే రెండు మూడు సార్లు పత్తి విత్తనాలు విత్తడం, కలుపు పెరగడం ఎ క్కువ మంది కూలీలు పెట్టడం, గుంటుకల్లు తోలడం తదితర వంటి పనుల వల్ల భారం ఎక్కువైంది. దీనికి తోడు గతంలో ఎ న్నడూ లేని విధంగా కాంప్లెక్స్ ఎరువుల ధర లు ఒకసారిగా భారీగా పెరగడంతో రైతు కు దరవుతున్నాడు. ఇప్పటికే పూత, కాత రావాల్సి ఉండగా పత్తి మొ క్కల్లో ఎదుగుదల లేదు. కా గా, వాంకిడి మండలంలో సు మారు 13 వేల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది రైతులు వర్షం పైన ఆధారపడి పంటను సాగు చేస్తున్నారు.

 ఎన్నడూ లేనంత ఎరువుల భారం...

కాంప్లెక్స్ ఎరువులైన 20-20-0 బస్తాకు గతంలో రూ.1350 ఉండగా ప్రస్తుతం రూ.2200 వందల నుంచి 2300ల వరకు పెరిగింది. వీటితోపాటు మిగతా ఎరువుల ధరలు కూడా ఒక్కొక్క బస్తాకు 100 నుంచి రూ.120 వరకు పెరగడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడింది. వీటితోపాటు పురుగుల మందులను పిచికారి చేస్తుండడంతో ఒక ఎకరాకు ఇప్పటివరకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. కాగా పంట చేతికి అంది వచ్చే వరకు పెట్టుబడులు మరింత పెరగనుంది. పైగా ఇప్పటివరకు రైతులు ఆశించిన స్థాయిలో పంట కనిపించడం లేదు. ఇంకా తేడా అది పంట చేతికి అంది వచ్చే సమయంలో అధిక వర్షాలు కురియడంతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర నష్టపోయారు. ఈసారైనా దిగుబడి రకపోతుందా అనే ఆశతో ఉన్న వాంకిడి మండల రైతులకు నిరాశ ఎదురవుతోంది.