calender_icon.png 10 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారాలకు తెర

10-02-2026 12:23:07 AM

  1. ప్రలోభాలు షురూ 
  2. ఇప్పటివరకు ఓలెక్క ఇకపై మరో లెక్క 
  3. సిద్ధమైన అభ్యర్థులు 
  4. ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల ఎత్తుగడలు 
  5. ఓటింగుకు మరో నలభై ఎనిమిది గంటలే గడువు

కామారెడ్డి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో మొదటి అంకం ముగిసినట్లుంది. అభ్యర్థుల ప్రచారాలపర్వం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియడంతో ఇక అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోబాలకు తెర లేపారు. కామారెడ్డి జిల్లాలోనీ కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు, బాన్సువాడలో 19 వార్డులు, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో 12 వార్డులు చొప్పున ఉన్నాయి.

ఆయా వార్డుల్లో కాంగ్రెస్, టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలతోపాటు రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న కు సంబంధించిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులు పాటు ఎంఐఎం పార్టీ అభ్యర్థులు, ఆప్ పార్టీ అభ్యర్థులు తోపాటు ఇండిపెండెంట్ లు పోటీలో ఉన్నారు. నామినేషన్లపర్వం ముగి యడంతో అభ్యర్థులు ప్రచారపర్వం మొదలు పెట్టారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు అభ్యర్థుల తరఫున ప్రచారము నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క,రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ  మంత్రి అజారుద్దీన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుందలో ప్రచారాలు అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను  గెలిపించాలని కోరారు. అధికార పార్టీ తమదే కాబట్టి అభివృద్ధికి ప్రత్యేక నిధులు వస్తాయని వాస్తాయని పట్టణాల్లో ప్రధాన డ్రైనేజీలు, సిసి రోడ్లు, నిర్మాణాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా అందజేస్తామని హామీలు కురిపించారు.

బిఆర్‌ఎస్ పార్టీ తరఫున టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాన్సువాడ ఎల్లారెడ్డి, బిచ్కుంద లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, కేంద్రమంత్రి తోపాటు మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రచారం నిర్వహించారు.

బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్నర్ మీటింగులు పెట్టి హోటాలను చైతన్యవంతం చేశారు.  సోమవారం 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసింది. రాజ్యాధికార పార్టీ తరపున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ అభ్యర్థుల తరఫున కామారెడ్డిలో ప్రచారం చేశారు.

రెండు రోజులే అభ్యర్థులకు  కీలకం 

మున్సిపల్ పట్టణాల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్, బిజెపి, లతోపాటు రాజ్యాధికార పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం ముగియడంతో మిగిలిన రెండు రోజులు అభ్యర్థులకు కీలకంగా మారాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు లు, మందు, డబ్బులు ఏరా చూపుతున్నారు.

పార్టీల అభ్యర్థులకు అధిష్టానం మద్యం డబ్బులు సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీల నేతలు ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లకు మద్యం, డబ్బులు, ఇతర గిఫ్ట్ ఐటమ్ లు ఇచ్చి ప్రలోభాలకు తెరలేపనున్నారు. ఒక్కొక్క ఓటుకు 500 నుంచి 5000 వరకు ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లకు రానుపోను ఖర్చులతో పాటు ఓటుకు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఓటింగ్కు రావాలని  అభ్యర్థిస్తున్నారు

గెలీపే లక్ష్యంగా అభ్యర్థుల హంగామా 

మున్సిపల్ అభ్యర్థులు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈసారి మున్సిపల్ లో కాలు మోపాలని ఉద్దేశంతో పలువురు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారి బంధువులు, అనుచరులు వార్డులలో తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచార పర్వం ముగియడంతో మద్యం, డబ్బులు హోటల్కు ప్రలోభాలకు గురి చేసేందుకు ఆయా పార్టీల నేతలతో పాటు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఓటర్లకు ప్రలోభాల ఆశలు రేకెత్తిస్తున్నారు.

ఓటింగ్కు 48 గంట లే గడువు 

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా నామినేషన్లు, స్క్రూటింగ్, పార్టీ బి ఫామ్ లు, వంటి కా వాటితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం పోటీలో నిలబడ్డ వారు గత వారం రోజులుగా ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారాలపర్వం ముగియడంతో ఇక  48 గంటలే పోలింగ్కు గడువు ఉండడంతో ప్రలోభాలు కు తెర లేపారు. సోమ, మంగళవారం ఓటర్లను రా ప్రలోబాలకు గురిచేసి ఓట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు నాన తండాలు పడుతున్నారు.

ఇతర ప్రాంతాలలో ఉన్నవారి ఓట్లే కీలకం 

మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఓట్లు తమ వార్డుల్లో ఉండడంతో వారిని రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవాలని పలువురు అభ్యర్థులు వారి వివరాలను సేకరించి వారిని తమ పట్టణానికి వచ్చి ఓటు వేసి వెళ్లేలా అభ్యర్థులు వారిని వారికి తెలిసిన వారితో మాట్లాడించి ఓటింగ్ రోజు ఓటింగ్లో పాల్గొని తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఎత్తుగడలు వేస్తున్నారు. వారికి ప్రలోభాల లకు కూడా వెనకాడడం లేదు. కావాల్సిందంతా ఓటు మాత్రమేనని తమ గెలుపు ఓటుతోనే సాధ్యమని అభ్యర్థులు భావిస్తున్నారు.

మూడు పార్టీలు ప్రతిష్టాత్మకమ్

మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు  గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీ లైన అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతి పక్ష పార్టీలైన బిఆర్‌ఎస్, బిజెపిల నేతలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఓటర్లకు నచ్చ చెప్పి తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

ప్రశాంతంగా నిర్వహిస్తాం 

ఎన్నికల అదనపు కలెక్టర్  ఇలా త్రిపాటి ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, ఓటర్లు ఓటింగ్లో ప్రశాంతంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఎన్నికల, అధికా రులు సిబ్బంది ప్రతి పట్టణ కేంద్రంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని  ఇలా త్రిపాఠి కోరారు.