లారీని ఢీకొన్న కారు
ఇద్దరు మృతి
పటాన్‌చెరు, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : పటాన్‌చెరు మండలం పా టి శివారులోని ఓఆర్‌ఆర్‌పై గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెం దారు. చంద్రాయణగుట్టకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్య క్తులు కర్ణాటకలోని గుల్బర్గా దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రి ఒకటిన్నర సమయంలో పాటి శివారులోని ఓఆర్ ఆర్‌పై ముందు వెళ్తున్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో ఎండీ మునవర్(35), హనీశ్‌బేగం(45) అక్కడి కక్కడే మృతి చెందగా మిగతా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమచారం అందుకున్న బీడీఎల్ పోలీసు లు గాయపడిన వారిని చికిత్స కో సం సమీపంలో ఉన్న దవాఖానకు తరలించారు. ఇద్దరి మృతదేహాలను పటాన్‌చెరు ప్రభు త్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు.






